Breaking News

బస్వాపూర్‌లో ఘనంగా వన మహోత్సవం

బస్వాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటారు. కేజీబీవీ, ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు బస్వాపూర్ బసవన్న చెరువు కట్టపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ శ్రీమతి వి. రమణ సురేష్, ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కె. మల్లుకొండ, ఎం. నాగనాథ్, ఐకేపీ వీవో బి. భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయచంద్, కేజీబీవీ పాఠశాల ఎస్‌వో హేమలత, ఉపాధి హామీ కూలీలు ఉప్పరి నారాయణ, మనోహర్, సాకలి విట్టల్, మేస్త్రీ బాలయ్య, మహమ్మద్ సాబ్, కమ్మరి నాగనాథ్, సుంకరి హనుమండ్లు, గ్రామపంచాయతీ వాటర్‌మెన్ వీరయ్య, పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *