విలాసాగర్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి).
జమ్మికుంట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మండల పరిధిలోని విలాసాగర్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రణవ్ వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలను వివరించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామారావు, పొనగంటి మల్లయ్య, సారంగపాణి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాగర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుమార్, నాయకులు రాజు, చందు, ఓదెలు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


