Breaking News

ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం

హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి).

ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ వాణిజ్య పన్నుల శాఖలో గ్రూప్-2 ద్వారా ఏసీటీవోగా పనిచేసి, అనంతరం గ్రూప్-1లో ఎంపికై 2009లో డీఎస్పీగా పోలీస్ శాఖలోకి వెళ్లారని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా లభించడం ఎంతో గర్వకారణమన్నారు.

పుల్ల కరుణాకర్ తొలుత కడప జిల్లా పొద్దుటూరులో డీఎస్పీగా విధులు నిర్వహించారని, అనంతరం హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో డీసీపీగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా సేవలందిస్తున్నారని తెలిపారు. నాన్‌-క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆయనకు ఈ హోదా లభించిందని పేర్కొన్నారు.పుల్ల కరుణాకర్ స్వగ్రామం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామమని, ఆయన కుటుంబ సభ్యులు కూడా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఆయన భార్య ఎస్. రజిని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారని, ఆయన సోదరి రెంటాల సుహాసిని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారని వివరించారు.

పుల్ల కరుణాకర్ ఐపీఎస్ హోదాలో పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత సేవలందించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ హోదా పొందిన పుల్ల కరుణాకర్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *