ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) .
ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం, సమయపాలన పాటించడం వంటివి విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, సమిత, విజయ్, రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్, సబిత, జ్యోతి, ట్వింకిల్ కుమార్, గంగా మోహన్, శ్యామల, రిషిక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


