Breaking News

‘ఇది దుశ్శాసన పర్వం.. అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే’: సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన!

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమకు జరిగిన అవమానాన్ని ‘దుశ్శాసన పర్వం’గా అభివర్ణించిన ఆమె, ఈ రోజును తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఒక ‘బ్లాక్ డే’ అని వ్యాఖ్యానిస్తూ అసెంబ్లీ వద్దే కన్నీళ్లు పెట్టుకున్నారు.

సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడిన కీలక అంశాలు:

  • గ్రిల్స్‌పై పడిపోయేదాన్ని:“మహిళా ప్రజాప్రతినిధులమని కూడా చూడకుండా పోలీసులు మమ్మల్ని ఇష్టానుసారంగా లాగేశారు. నా చీర లాగి అవమానించారు. తోపులాటలో కొద్దిగా అదుపు తప్పినా అక్కడున్న ఇనుప గ్రిల్స్‌పై పడిపోయేదాన్ని. ఆ సమయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి వచ్చి నన్ను కాపాడారు” అని తెలిపారు.
  • ప్రభుత్వాన్ని నిలదీత: ప్రజల సమస్యలను చట్టసభలో లేవనెత్తడానికి రావడమే తాము చేసిన పాపమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటని నిలదీశారు.

పోలీసుల స్పందన:

మహిళా ఎమ్మెల్యేల ఆరోపణలపై డీసీపీ శిల్పవల్లి స్పందించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పోలీసులు ఎలాంటి అమర్యాదకరంగా ప్రవర్తించలేదని ఆరోపణలను ఖండించారు. నల్ల దుస్తులు ధరించినందుకు కాకుండా, టీషర్టులపై ఉన్న వివాదాస్పద నినాదాల కారణంగానే వారిని లోపలికి అనుమతించలేదని డీసీపీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *