సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు
పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి ఎంపిక పట్ల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు, స్థానికులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీ కోచ్‌లు అభిమన్యు, శరత్ కళ్యాణ్, పవన్ సాయి, పవన్ సీలపోగు మాట్లాడుతూ.. అకాడమీకి చెందిన ముగ్గురు ఆటగాళ్లు HCA అండర్-16 జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.యువ క్రికెటర్ల ఎంపిక పాల్వంచలోని క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.


