రాహుల్ గాంధీకి AISF పోస్ట్‌కార్డుల ద్వారా విద్యార్థుల వినతి
కొత్తగూడెం,సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రాహుల్ గాంధీకి పోస్ట్‌కార్డుల ద్వారా వినతి తెలిపారు.ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల విజయ్ మాట్లాడుతూ.. SBTET బోర్డును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య కార్పొరేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉందన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా విద్యకు ఉద్యోగాల్లో ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జీఓ 97ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీని కోరారు. ముఖ్యంగా సింగరేణి తదితర సంస్థల్లో సబ్ ఇంజనీర్ పోస్టులకు డిప్లొమా విద్యార్థులకు ఉన్న అర్హతలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు సలిగంటి జయదీప్, యశ్వంత్, ప్రియాన్షి, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

