Breaking News

ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం

ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల

కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి సత్కరించారు.

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం సర్వే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి సుజాతనగర్ మండలం సీతంపేటలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం చేపట్టిన సర్వేలో ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన ప్రాంతం, అందుబాటులో ఉన్న భూములు, ఇతర అంశాలపై ఏఏఐ అధికారులు పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటైతే పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ, ఏఏఐ శాఖల అధికారులు, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కొండం వెంకన్న, బూసి శ్రీను, బొందిలి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *