Breaking News

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి).

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, రాత్రి వేళల్లో భద్రతా చర్యలను పరిశీలించారు.అనంతరం కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించిన ఎస్పీ.. అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలర్టింగ్, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాత్రి వేళల్లో పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

రాత్రి సమయంలో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీని పెంచాలని ఆదేశించారు.సస్పెక్ట్, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డయల్‌-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *