మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని మద్నూర్ తహసీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. సంబంధిత ఓటర్లు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

