ఖమ్మం/హైదరాబాద్:
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రెండు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, నిరుద్యోగులు, బీసీల సమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ పేరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
ఎవరీ డాక్టర్ లోకేష్ యాదవ్?:
- విద్యార్థి ఉద్యమాల నుంచి పాలిటిక్స్: విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయా అరంగేట్రం చేసిన లోకేష్ యాదవ్, ఎన్ఎస్యూఐ (NSUI) మరియు యూత్ కాంగ్రెస్ వేదికగా విద్యా, నిరుద్యోగ సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేశారు.
- సుదీర్ఘ పార్టీ సేవలు: గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీడియాలో కాంగ్రెస్ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు.
సమీకరణాలు కలిసి వస్తాయా?:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావవంతమైన బీసీ నాయకుల సంఖ్య తక్కువగా ఉండటం లోకేష్ యాదవ్‌కు రాజకీయంగా కలిసివచ్చే ప్రధాన అంశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న యంగ్ లీడర్ కావడంతో అధిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరి అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ యువ నేతకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

