తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS).
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్‌ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను కూడా తక్కువ ధరకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పేదలపై నిర్మాణ వ్యయ భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్లను నిర్మించి ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు డ్రా ద్వారా ఎంపికైనట్లు తేలితే వారి ఎంపికను తొలగిస్తామని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

