ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్న విద్యార్థులు
భద్రాచలం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఎకో క్లబ్, ఎన్ఎస్ఎస్, కల్చరల్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి ప్రతిమలను రూపొందించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ.. మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను వినాయక చవితి రోజున భద్రాచలం పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో డాక్టర్ కపిల భారతి, ఎకో క్లబ్ కోఆర్డినేటర్ బి. సుధాకర్ రావు, ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



