Breaking News

Shiv Thakur

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీస్ చేయాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్.

బోధన్, జూలై 2: E6 న్యూస్ ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హై స్కూల్‌కు చెందిన AP20TB6907 నంబర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బండారుపల్లి–శ్రీనివాస్ క్యాంప్…

Read More

విద్యా సంస్థలపై దాడులు, బందులకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు: CP సాయి చైతన్య.

నిజామాబాద్, జూలై 2: నిజామాబాద్. (E6 క్రైమ్ న్యూస్- శివ ఠాకూర్) విద్యాసంస్థలపై దాడులు చేయడం, యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యాసంస్థల బంద్‌లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో వ్యక్తులు పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా…

Read More

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం… ఏబీవీపీ ఆందోళన, ఎం ఈ ఓ విచారణ.

చందూరు, జూలై 2:(E6 న్యూస్- ఔరాద్ అశోక్)నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన…

Read More

ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.

పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్) నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం…

Read More

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం, ఏబీవీపీ ఆందోళన, ఎంఈఓ విచారణ

చందూరు, జూలై 2:నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఆర్పీని…

Read More

జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ XII ప్రారంభం

నిజామాబాద్, జూలై 2:(E6 క్రైమ్-శివ ఠాకూర్) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి…

Read More

రైతు ఆశీర్వాద సభ కాదు కాంగ్రెస్కు రైతుల శాపనార్థాల సభ: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “రైతు ఆశీర్వాద సభ” వాస్తవానికి రైతుల “శాపనార్థాల సభ”గా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. వేల్పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు బకాయిలు చెల్లించకపోవడం, యూరియా కొరత, వడ్ల కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్…

Read More

మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ

నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…

Read More

E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

Read More

మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

హెడ్లైన్:

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

సబ్ హెడ్లైన్లు:

పెర్కిట్ రేణుక ఎల్లమ్మ ఆలయ సందర్శన సందర్భంగా శాలువాతో ఘన సత్కారం

పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న మర్యాదపూర్వక భేటీ

నిజామాబాద్, జూలై 1:

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెర్కిట్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై వారు స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణు యాదవ్, బాల్కొండ మాజీ మండల అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, గుమ్మిరియాల సర్పంచ్ సంజీవ్, లక్కోరా ఉప సర్పంచ్ రాము, తోర్తి సర్పంచ్ భూమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read More