Technology
🇮🇳 భీంగల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో భీంగల్ పట్టణంలో ఆగస్టు 11న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు సుదర్శన్ థియేటర్ వద్ద ర్యాలీ ప్రారంభమై సుమంగళి చౌరస్తా వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువతీ యువకులు కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “దేశం కోసం…..
ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం
నిర్మల్, ఆగస్టు 10: (E6 tv NEWS (Md. అమీరుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు…
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్). బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని…
మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలి
మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ భీంగల్ ఆగస్టు 9: (E6 tv NEWS: T. గంగాధర్). భీంగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా అధికారులు వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని…
టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా గులని సాయిలుకు ఘన సన్మానం
బిచ్కుంద, ఆగస్టు 9: (E6 tv NEWS ప్రతినిధి).టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన గులని సాయిలును బిచ్కుందలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన గులని సాయిలు టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం సామాజిక వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని…
మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా కేసుల నమోదు.. భారీగా గంజాయి, కల్లు స్వాధీనం వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన, వినియోగదారులకు కౌన్సెలింగ్ నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణా, గుడుంబా తయారీపై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు DPEO నిజామాబాద్ పరిధిలోని వివిధ SHO పరిధుల్లో NDPS, కల్లు, గుడుంబా తదితర కేసులను నమోదు…
బాధిత వికలాంగుడికి పోలీసుల భరోసా
దాతల సహకారంతో ట్రై సైకిల్ అందజేసిన ఎస్ఐ నరేష్ హుజూర్‌నగర్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ హుజూర్‌నగర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన వికలాంగుడు ఇందిరాల పిచ్చయ్యకు దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్‌ను అందజేశారు. పిచ్చయ్య గత నెలలో తన ఇంటి ఎదుట ట్రై సైకిల్‌ను పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో ట్రై…
నిజామాబాద్ నగర అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్లు, వంతెనలు, కొత్త జాతీయ రహదారి కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్) నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకే జనసేన ఆవిర్భావం: మీసాల శ్రీనివాసరావు
ఆగస్టు 8న నిజామాబాద్‌లో జనసేన రెండు జిల్లాల సన్నాహక సమావేశం రాష్ట్ర ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడి కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్). కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సంయుక్త సన్నాహక సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు…

