హైదరాబాద్ : ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద ప్రతిభావంతులైన అమ్మాయిలకు పైలట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన సిఎస్ఆర్ విభాగం ‘ఇండిగోరీచ్’ (IndiGoReach) మరియు ‘భారత్ కేర్స్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ ప్రత్యేకతలు:
- ఉచిత కమర్షియల్ పైలట్ ట్రైనింగ్: ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ (Giving Wings to Fly) కార్యక్రమంలో భాగంగా అర్హులైన అమ్మాయిలకు ఉచితంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) మరియు ఏటీఆర్ (ATR) టైప్ రేటింగ్ శిక్షణ ఇస్తారు.
- ఉచిత వసతి & ఇతర సౌకర్యాలు: దాదాపు 20 నెలల పాటు సాగే ఈ కోర్సు కాలంలో అభ్యర్థులకు ఉచితంగా భోజనం, వసతి, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు సీనియర్ పైలట్ల ద్వారా ప్రత్యేక మార్గదర్శకత్వం (Mentorship) ఉచితంగా అందిస్తారు.
- ఎలా దరఖాస్తు చేసుకోవాలి?: అర్హులైన విద్యార్థినులు indigoreachgwf.scholarsbox.in అనే అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కళాశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్, వెబ్నార్ల ద్వారా దీనిపై అవగాహన కల్పిస్తారు.
- అధికారుల కామెంట్స్: ఆర్థిక ఇబ్బందుల వల్ల విమానం ఎక్కలేకపోతున్న పేద అమ్మాయిలు, ఏవియేషన్ రంగంలో ఆకాశమే హద్దుగా ఎదిగేలా తలుపులు తెరిచామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

