Breaking News

కేటీఆర్‌, హ‌రీశ్ రావుపై కేసు నమోదు: లైంగిక వేధింపుల ఆరోపణలతో షాక్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తానీరు హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఫిర్యాదులో ఉన్న ప్రధాన ఆరోపణలు:

  • విధులకు ఆటంకం & దుర్భాషలాడటం: అసెంబ్లీ గేట్ నెం.3 వద్ద విధి నిర్వహణలో ఉన్న తమను నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నల్ల టీ-షర్టులు, ప్లకార్డులతో లోపలికి వెళ్లనీయకపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు అసభ్య పదజాలంతో దూషించారని సదరు మహిళా కానిస్టేబుల్ పేర్కొన్నారు.
  • చొక్కాలు విప్పి తీవ్ర ఇబ్బంది: నిరసన తెలపడంలో భాగంగా హరీశ్‌రావు తన టీ-షర్టును విప్పి ఓ పోలీసు అధికారిపైకి విసిరేశారని, మహిళా సిబ్బంది ముందే అర్ధనగ్నంగా నిలబడి తీవ్ర ఇబ్బంది కలిగించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇదే రీతిలో ప్రవర్తించారని తెలిపారు.

పోలీసుల చర్యలు: మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, దాడులకు తెగబడటం మరియు మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం (లైంగిక వేధింపుల ఆరోపణలు) వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *