హైదరాబాద్: తెలంగాణలోని గిరిజన, అటవీ గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సచివాలయంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయాలు & ముఖ్యాంశాలు:
- దశలవారీగా సీటీ స్కాన్ (CT Scan) సేవలు: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల (ITDA) పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో దశలవారీగా సీటీ స్కాన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసు రానున్నారు.
- ఆస్పత్రుల విస్తరణ & అప్‌గ్రేడేషన్: స్థానిక అవసరాలు మరియు ప్రజలు ప్రయాణించే దూరాన్ని బట్టి కొత్తగా సబ్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHCs) ఏర్పాటు చేయడంతో పాటు.. ఉన్న PHCలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs), ఏరియా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
- రిమ్స్ (RIMS) అభివృద్ధి: ఆదిలాబాద్‌లోని రిమ్స్ (RIMS) ఆస్పత్రిని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కార్డియాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రారంభించామని, అత్యవసర చికిత్సల కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా మరిన్ని విభాగాలను విస్తరిస్తామని చెప్పారు.
- మండలానికో అంబులెన్స్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను మంజూరు చేశామని, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతామని వివరించారు.
- సీజనల్ వ్యాధులపై అప్రమత్తత: వర్షాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, అతిసారం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వేద్మా బొజ్జు, పాయల్ శంకర్, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, కోవ లక్ష్మి, రామారావు పవార్, అనిల్ జాధవ్‌లతో పాటు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

