Breaking News

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే సర్పంచ్ తూర్పు గంగామణి లక్ష్యం

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని సర్పంచ్ తూర్పు గంగామణి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ ముంపు ముప్పును అధిగమిస్తూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఆమె కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో అంతర్గత రోడ్ల విస్తరణ మురుగు కాలువల ఆధునీకరణ మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించారు. గ్రామం ఉనికిని కాపాడుతూనే విద్య వైద్య రంగాలను బలోపేతం చేసి మంచిప్పను జిల్లాలోనే అగ్రగామిగా నిలుపుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *