హైదరాబాద్: బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పిల్లలతో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చేసిన సరదా ప్రాంక్ కాల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది అండర్ 18 వరల్డ్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేటీఆర్, పిల్లల కోరిక మేరకు ప్రభాస్‌కు ఫోన్ చేసి ఆటపట్టించారు.
పాడ్‌కాస్ట్‌లో ఉన్న ఒక బాలిక ఫోన్ తీసి, “రోడ్డుపై ఫోన్ దొరికింది.. ఎవరు మాట్లాడుతున్నారు?” అని అడగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రభాస్ వెంటనే కాల్ కట్ చేశారు. దీంతో కేటీఆర్, పిల్లలు నవ్వుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మళ్లీ ఫోన్ చేసి ఇది ప్రాంక్ కాల్ అని అసలు విషయం చెప్పడంతో ప్రభాస్ కూడా నవ్వేశారు. పిల్లల అమాయకత్వం, ప్రభాస్ రియాక్షన్, కేటీఆర్ సరదా సంభాషణ ఉన్న ఈ క్యూట్ వీడియోను నెటిజన్లు, అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

