నిజామాబాద్లో 42 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని 42 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాలు వంటి కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పథకం పారదర్శకంగా అమలవుతోందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకే నేరుగా చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి అర్హుడికి ఈ పథకం ప్రయోజనం అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, శేఖర్ గౌడ్, ఆకుల లలిత, బొబ్బిలి రామకృష్ణ, జావిద్ అక్రమ్, కరీం, రత్నాకర్, ఫహీం, అరుణ్ ఖాన్, హాఫిజ్ లైక్ ఖాన్, అహ్మద్, నయీమ్ షహరాన్, పాపా ఖాన్, జాఫర్ హుస్సేన్, వహీద్, ముజాహిద్ ఖాన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


