ఎన్టీఆర్ జిల్లా: నందిగామ శివారు చందాపురం బైపాస్ సమీపంలో ఉన్న శ్రీ సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూముల వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆక్రమణకు గురైన 79 సెంట్ల భూమిని తిరిగి దేవస్థానానికే అప్పగించాలని సర్వోన్నత నాయస్థానం ఆదేశించింది.
చందాపురం వద్ద ఉన్న సర్వే నంబర్ 822-2లో దేవుడి భూమిని ఆక్రమించి, అందులోని 12 సెంట్లలో కొందరు వ్యక్తులు అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. దీనిపై దేవస్థానం చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళి రాఘవ కుమార్ కోర్టును ఆశ్రయించగా, రికార్డులను పరిశీలించిన హైకోర్టు ఆక్రమణలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ యంత్రాలతో ఆక్రమిత నిర్మాణాలను నేలమట్టం చేసి దేవాదాయ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

