ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్‌తో పాటు పలువురు కార్యకర్తలు
నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామ సర్పంచ్ జింక రాజేందర్, పలువురు కార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శుక్రవారం గూపన్పల్లి బైపాస్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ విధానాలపై విశ్వాసం ఉంచి పార్టీలో చేరిన సర్పంచ్ రాజేందర్‌తో పాటు కార్యకర్తలను అభినందించారు. తూంపల్లి గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని, గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు తూంపల్లి మహేందర్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంపత్ రెడ్డి, గోప్య నాయక్ తాండా రవి, తూంపల్లి ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.

