Breaking News

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS అమలు

ఆగస్టు 2న పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (TTC) ఆగస్టు–2026 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.ఆగస్టు 2 (ఆదివారం) నిర్వహించే పరీక్షల సందర్భంగా నిజామాబాద్…

Read More

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు…

Read More

హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించిన ధర్మపురి సంజయ్

హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…

Read More

రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!

తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…

Read More

ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన

అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…

Read More

అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ఓట్యాట్‌పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర, తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్‌పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా…

Read More

కోర్ డిప్రెషన్ ఎఫెక్ట్.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్).  బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు…

Read More

ఫాం పాండ్‌ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం

మద్నూర్‌లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్‌లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్‌ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…

Read More

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!

జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…

Read More