Technology
కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత
కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం…
ముధోల్ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి ఫలితమే: ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృతజ్ఞతలు స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానున్న అధ్యయన కేంద్రం ముధోల్, జూలై 25: (E6 tv NEWS:తిరుపతి గౌడ్)ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ముధోల్‌తో పాటు పరిసర…
నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి
టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…
గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు
డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…
హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…
అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం
రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…
వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…
వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…
క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన!
హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం రంగానికి భారత్‌కే గేట్‌వేగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రముఖ క్వాంటం కంప్యూటింగ్ సంస్థ ‘క్వాంటినమ్’ (Quantinuum) సీఈఓ డాక్టర్ రాజీవ్ హజ్రా మరియు వారి ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా భారతదేశ క్వాంటం లక్ష్యాలను బలోపేతం చేసేందుకు భాగస్వామ్యం వహించడంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: రాష్ట్రంలో అత్యున్నత…
నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?
జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

