Medak
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకే జనసేన ఆవిర్భావం: మీసాల శ్రీనివాసరావు
ఆగస్టు 8న నిజామాబాద్‌లో జనసేన రెండు జిల్లాల సన్నాహక సమావేశం రాష్ట్ర ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడి కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్). కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సంయుక్త సన్నాహక సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు…
ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి: టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహణకు యూఎస్‌పీసీ నిర్ణయం ఏర్గట్ల, ఆగస్టు 7: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో…
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
కొత్త అప్రోచ్ రోడ్లు, MRR, CRR, హ్యామ్ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచన నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్ ) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా….
జోగిపేట ఏరియా ఆస్పత్రి డాక్టర్ సస్పెన్షన్.. ప్రైవేట్ డెంటిస్ట్‌తో వైద్యం చేయించినందుకు దామోదర రాజనర్సింహ చర్యలు!
హైదరాబాద్ / జోగిపేట (E6TV News): ప్రభుత్వ ఆసుపత్రికి డ్యూటీకి హాజరుకాకుండా తన స్థానంలో ఓ ప్రైవేట్ దంత వైద్యుడితో (Dentist) రోగులకు పరీక్షలు చేయించిన తీవ్ర నిర్లక్ష్య ఉదంతంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా స్పందించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రికి చెందిన డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ రమేష్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగింది? సూపరింటెండెంట్‌పై డిపార్ట్‌మెంటల్ యాక్షన్:…
ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం
మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….
టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
రీజినల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సేవలను స్మరించిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS, శివ ఠాకూర్)ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా…
సంగారెడ్డి, సదాశివపేటలో వైభవంగా బోనాల పండుగ!
సంగారెడ్డి: సంగారెడ్డి మరియు సదాశివపేట పట్టణాల్లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన అంశాలు:
అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి…
రాజీవ్ రహదారిపై ప్రయాణించే మహిళల భద్రతకు బిగ్ అప్‌డేట్: సిద్దిపేట పోలీసుల ‘SHE SAFE’ ప్రారంభం!
సిద్దిపేట: హైవేలపై ప్రయాణించే మహిళలు, వారి కుటుంబాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజీవ్ రహదారి (Rajiv Rahadari) మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, ప్రయాణికుల కోసం ‘షీ సేఫ్’ (SHE SAFE) అనే ప్రత్యేక భద్రతా రక్షణ కేంద్రాల ప్రాజెక్ట్‌ను సీపీ రష్మీ పెరుమాళ్ శుక్రవారం ప్రారంభించారు. హైవేపై ప్రయాణించే మహిళలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా సురక్షితంగా విరామం (Stopover) తీసుకునేలా నమ్మకమైన కేంద్రాలను…

