Ranga Reddy
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి). యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద…
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను…
మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా కేసుల నమోదు.. భారీగా గంజాయి, కల్లు స్వాధీనం వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన, వినియోగదారులకు కౌన్సెలింగ్ నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణా, గుడుంబా తయారీపై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు DPEO నిజామాబాద్ పరిధిలోని వివిధ SHO పరిధుల్లో NDPS, కల్లు, గుడుంబా తదితర కేసులను నమోదు…
బాధిత వికలాంగుడికి పోలీసుల భరోసా
దాతల సహకారంతో ట్రై సైకిల్ అందజేసిన ఎస్ఐ నరేష్ హుజూర్‌నగర్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ హుజూర్‌నగర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన వికలాంగుడు ఇందిరాల పిచ్చయ్యకు దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్‌ను అందజేశారు. పిచ్చయ్య గత నెలలో తన ఇంటి ఎదుట ట్రై సైకిల్‌ను పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో ట్రై…
ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…
మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…
మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు
ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత ప్రభుత్వం రూ.32 లక్షలు – గ్రామస్థుల విరాళం రూ.8 లక్షలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల…
కమిషన్ల కోసమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ
ఏర్గట్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…
గంటల్లోనే అదృశ్యమైన బాలుడి ఆచూకీ
కమ్మర్పల్లి పోలీసుల చాకచక్యానికి ప్రజల ప్రశంసలు కమ్మర్పల్లి, ఆగస్టు 6: (E6 tv NEWS. ప్రతినిధి) కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలతో అదృశ్యమైన ఓ బాలుడిని గంటల వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానిక ప్రజలు, బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బందిని అభినందించారు. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన…

