Breaking News

సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్

ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి పాలాభిషేకం నిర్వహించారు.

పండుగ సాయన్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. సాయన్న చరిత్ర, సేవలను భావితరాలకు తెలియజేసేలా అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దమనుషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *