Breaking News

తాళ్ల రాంపూర్, దోమచందాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతిని)

ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను తాళ్ల రాంపూర్, దోమచందా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో తహసీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇన్‌చార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్, దోమచందా గ్రామంలో సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమాల్లో రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచ్‌లు, జీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, కార్డుదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *