హైదరాబాద్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు బాబాసాహెబ్‌కు ఘనంగా నివాళులర్పించారు
అణగారిన వర్గాల గొంతుకగా సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని మంత్రి కొనియాడారు భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని తెలిపారు సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి వారి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు
అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదు ఆయన యావత్ భారతదేశ గర్వకారణం అని ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సమానత్వం మరియు సౌభ్రాతృత్వంతో మెలిగినప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సీతక్క పేర్కొన్నారు అంబేద్కర్ గారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుదామని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు
రాజ్యాంగ చిహ్నానికి సీతక్క సలాం అంబేద్కర్ ఆశయాలే మా ప్రభుత్వ బాట

