నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల బలిదానాలను గుర్తించి, సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ చర్యతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు, తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాం వారసత్వ రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన దినేష్ కుమార్, విమోచన పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

