Breaking News

విదేశీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ భారీ ఉపశమనం.. రూ.180 కోట్ల స్కాలర్‌షిప్…

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ.179.9 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంతో విదేశాల్లో చదువుకుంటున్న 3,008 మంది విద్యార్థులకు ఆర్థిక ఊరట లభించనుంది.

విడుదలైన నిధుల వివరాలు మరియు లబ్ధిదారుల సంఖ్యను కింద చూడవచ్చు:

పథకం / సామాజిక వర్గంలబ్ధిదారుల సంఖ్యకేటాయించిన నిధులు
మైనారిటీ విద్యార్థులు (సిఎమ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్)1,063రూ. 76.1 కోట్లు
ఎస్సీ విద్యార్థులు (అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి)1,193రూ. 48.4 కోట్లు
ఎస్టీ విద్యార్థులు (అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి)573రూ. 36.9 కోట్లు
బీసీ విద్యార్థులు (జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి)179రూ. 18.4 కోట్లు
మొత్తం3,008 మందిరూ. 179.9 కోట్లు

మంజూరైన లబ్ధిదారులందరికీ ఇప్పటికే ఆర్థిక చెల్లింపులు పూర్తయ్యాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి నిధుల కొరత లేకుండా చదువు కొనసాగించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *