నిజామాబాద్, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి).
యువత మత్తు పానీయాలు, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.యువతలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఆందోళన కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో 21-08-2026 శుక్రవారం విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉంచడంతో పాటు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, సంబంధిత ప్రభుత్వ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువతను మత్తు వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు సమష్టిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

