కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు
కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…

