Breaking News

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: శివ ఠాకూర్). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా…

Read More

టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 15:(E6 tv NEWS: శివ ఠాకూర్). దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్  ఎస్.వి.జి. కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల…

Read More

గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్

నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్). స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్‌లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ…

Read More

పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు

నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్ గార్డెన్‌లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ…

Read More

హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో పాదయాత్ర–సత్యాగ్రహం

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల…

Read More

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…

Read More

నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్

జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి). ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని…

Read More

బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం

బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…

Read More

CEIR పోర్టల్‌తో 8 సెల్‌ఫోన్లు రికవరీ

యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని…

Read More