Khamam
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రకృతి సిద్ధమైన విగ్రహాలతో అలరించిన విద్యార్థులు పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకులు, బంకమట్టి, క్లే, ధాన్యాలు, పప్పుధాన్యాలు, గోధుమ పిండితో స్వయంగా తయారు చేసిన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మిర్చాల మాట్లాడుతూ వినాయక చవితి జ్ఞానం, శ్రేయస్సు, అభ్యుదయానికి ప్రతీక అన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తగా వినాయకుడిని…
సాయుధ రైతాంగ పోరాటం అజరామరం
అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు. రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద…
అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
అటవీ సంపదతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణ కొత్తగూడెం,సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్…
అవుట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు….
నిరుపేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన పత్తి రాము
మాజీ సొసైటీ చైర్మన్‌కు దళితులు, నిరుపేదల కృతజ్ఞతలు రుద్రూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)ఇల్లు లేని నిరుపేదలు, దళితుల సమస్యను పరిష్కరించేందుకు మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కొంతమంది నిరుపేదలు ప్రస్తుతం ఆవాసంగా ఉంటున్నారు. అయితే ఆయా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని…
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ అశోక్ పటేల్
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు రేషన్ సేవల్లో పారదర్శకత పెంచేందుకే స్మార్ట్ కార్డులు మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి…
తాణకాలాన్‌లో అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్య
ఎడ్లకు, ట్రాక్టర్లకు ప్రత్యేక అలంకరణలు.. గ్రామంలో పండుగ సందడి ఎడపల్లి, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఎడపల్లి మండలం తాణకాలాన్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువులు, వ్యవసాయ యంత్రాలకు…
రూ.1.25 లక్షల ఎల్‌ఓసీ అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు ఏర్గట్ల, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రాయన గంగాధర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్య ఖర్చుల కోసం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఈరవత్రి అనిల్‌కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.25 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద…
ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం
నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రాత్మకం పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటాలు అవసరం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా కొత్తగూడెం, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి)వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో…

