Breaking News

కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…

Read More

పాపన్న గౌడ్ సాక్షిగా దళిత బహుజనుల హక్కుల కోసం ఐక్య ఉద్యమం

నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ…

Read More

పాపన్న ఆశయాలు నెరవేర్చినప్పుడే అసలైన నివాళి

నిర్మల్, ఆగస్టు 18: (E6tv NEWS:A. తిరుపతి గౌడ్) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గౌడ సంఘాల నాయకులు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి…

Read More

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం

బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…

Read More

హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…

Read More

భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..

భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…

Read More

తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏర్పాటు

నూతన కార్యవర్గం ఎన్నిక.. అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ హైదరాబాద్ ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రాఘవాచారి, ఉపాధ్యక్షులు కొండూజు విజయ్ కుమార్ చారి, కార్యనిర్వాహక కార్యదర్శి అనంత రాములు తదితరులు…

Read More

మాజీ సర్పంచ్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే

పిట్లం, ఆగస్టు 16: (E6 tv NEWS: ప్రతినిధి) పిట్లం మండలం రాంపూర్ (కలాన్) మాజీ సర్పంచ్ మందాడి నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరై నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

Read More

బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే…

Read More

నిజామాబాద్ జిల్లాలో పోక్సో కేసులపై పోలీస్ కమిషనర్ సమీక్ష

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి. బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ పి. సాయి చైతన్య నిజామాబాద్, ఆగస్టు 16:(E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన…

Read More