Breaking News

మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం

మద్నూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే…

Read More

అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI

భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…

Read More

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?

దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).  ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన…

Read More

మాజీ మంత్రి రేఖానాయక్ రైస్ మిల్ పై నమోదైన కేసు

నిర్మల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు చెందిన రైస్ మిల్లు నుంచి ₹40.96 కోట్ల విలువైన ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్లు గుర్తించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) నిర్మల్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కేసు వివరాలు & ముఖ్యాంశాలు: మిల్లు వివరాలు:…

Read More

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు…

Read More

చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.

అక్బర్‌నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…

Read More

విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…

Read More

సలాబాత్‌పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్

మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్‌పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్‌పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్‌పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…

Read More

ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్

మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ…

Read More

ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…

Read More