Breaking News

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్

ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…

Read More

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…

Read More

పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…

Read More

భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…

Read More

సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్

ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…

Read More

ఒక హత్య.. ఎన్నో ప్రశ్నలు

గురువుకు గోరీ కట్టిన గంజాయి మత్తు! స్పెషల్ స్టోరీ, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).చదువు చెప్పి జీవితానికి బాటలు వేయాల్సిన గురువే దారుణ హత్యకు గురికావడం.. ఆ హత్యకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడ్డారన్న దర్యాప్తు అంశాలు వెలుగులోకి రావడం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, చెడు…

Read More

నందిపేట ప్రయాణికుల నరకయాతన కథనం నిరాధారం: టీజీఎస్ఆర్టీసీ

నిజామాబాద్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) నందిపేట ప్రయాణికుల ఇబ్బందులపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన “నందిపేట ప్రయాణికుల నరకయాతన” కథనం పూర్తిగా నిరాధారమని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.నిజామాబాద్–నందిపేట మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్-1 డిపో నుంచి నందిపేట మధ్య 5 పల్లెవెలుగు, 4 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు….

Read More

బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష

బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…

Read More

నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం

నిజాంసాగర్, ఆగస్టు 20:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ప్రస్తుత నీటి పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితి, సాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుత నీటి లభ్యత, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరాపై సమీక్షించినట్లు తెలిపారు.రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు…

Read More