Warangal
గుండెపోటుతో జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ మృతి
జుక్కల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన విఠల్‌రావు పాటిల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు.తోటి న్యాయవాదులతో కలిసి రాజస్థాన్‌లోని సోమ్‌నాథ్ యాత్రకు వెళ్లిన విఠల్‌రావు పాటిల్ తిరుగు ప్రయాణంలో గురువారం జైపూర్ సమీపంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు….
మట్టి గణపతులను పూజిద్దాం
ఏర్గట్ల, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితిని పురస్కరించుకొని ఏరుగట్లలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మట్టి గణపతుల ప్రాశస్త్యంతో పాటు వినాయక చవితి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను వినియోగించడం ఎంతో ముఖ్యమని సూచించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి…
కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం
డోంగ్లి, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల భూములు, సాగు చేస్తున్న పంటలు, ఇతర వ్యవసాయ వివరాలపై రైతులతో చర్చించారు.గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం…
అవుట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు….
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం…
హనుమకొండ: తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) ఎన్. సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం (రైతు/మాజీ విద్యుత్ శాఖ ఉద్యోగి) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారం, తన కుమారుడు సుమంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పెద్దమొత్తంలో కామ్‌పోజ్ (Calmpose) మాత్రలు మింగారు. హనుమకొండలోని రామ్‌నగర్‌లోని నివాసంలో ఉదయం స్పృహతప్పి పడి ఉన్న సుబ్రహ్మణ్యాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే…
పంచాయతీలకు శుభవార్త.. సొంత ఆదాయం ఇక గ్రామాభివృద్ధికే
ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు.. గ్రామసభ తీర్మానంతో స్థానిక అవసరాలకు వినియోగం పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)కు సవరణకు అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్, సెప్టెంబర్ 11: (E6tv NEWS). తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. పంచాయతీలు తమ ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని, గ్రామాభివృద్ధి, స్థానిక అవసరాల కోసం…
కేటీఆర్, హరీష్ రావుపై కేసులు కక్ష సాధింపే
కాంగ్రెస్ సర్కారుకు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: జీవన్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీష్ రావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ అశోక్ పటేల్
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు రేషన్ సేవల్లో పారదర్శకత పెంచేందుకే స్మార్ట్ కార్డులు మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి…
తాణకాలాన్‌లో అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్య
ఎడ్లకు, ట్రాక్టర్లకు ప్రత్యేక అలంకరణలు.. గ్రామంలో పండుగ సందడి ఎడపల్లి, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఎడపల్లి మండలం తాణకాలాన్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువులు, వ్యవసాయ యంత్రాలకు…
ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లున్నా పంటలు ఎండుతున్నాయి
2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు 6 టీఎంసీలు విడుదల చేయాలి అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ)లో సుమారు 46 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సుమారు 2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు వెంటనే 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని…

