Warangal
రూ.1.25 లక్షల ఎల్‌ఓసీ అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు ఏర్గట్ల, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రాయన గంగాధర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్య ఖర్చుల కోసం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఈరవత్రి అనిల్‌కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.25 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద…
పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్
సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పోటీలు దేశవ్యాప్తంగా 300–400 మంది సీనియర్ క్రీడాకారుల రాక పాల్వంచ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా తొలిసారిగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి సహకారంతో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల…
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’
శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…
ఇందిరా ప్రియదర్శినికి కాళోజి నంది అవార్డు
కొత్తగూడెం అడ్వకేట్‌కు దక్కిన అరుదైన ఘనతబెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు బెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు పాల్వంచ,సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాద రంగానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్‌బస్తీకి చెందిన అడ్వకేట్ ఇందిరా ప్రియదర్శిని జిల్లా కోర్టు పరిధిలో ప్రతిభ కనబరిచి బెస్ట్ జూనియర్ అడ్వకేట్ గా ఎంపికయ్యారు. అంతేకాకుండా కాళోజి జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డు ను సైతం…
వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి
మద్నూర్, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సుల్తాన్‌పేట్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్‌లోని అదనపు సహాయక ఇంజినీర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం…
ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు మహాయజ్ఞం
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం మహాయజ్ఞం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన మహాయజ్ఞంలో ఆర్య సమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా ఈ…
ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…
ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డు అందుకున్న అడ్వకేట్ యరగాని సోనీ
జూనియర్ న్యాయవాదిగా ప్రతిభకు గుర్తింపు హుజూర్‌నగర్,సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును అందుకున్నారు. కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదుల…
సివిల్స్ కొట్టే ఛాన్స్.. ఉచిత శిక్షణకు గ్రీన్‌సిగ్నల్!
రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ…
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు….

