హైదరాబాద్: సికింద్రాబాద్లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మోరీ (ఆయుధశాల) నుంచి 12 అత్యాధునిక తుపాకులు (AK-203, ఇన్సాస్ రైఫిళ్లు) మరియు సుమారు 2,000 రౌండ్ల మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై మిలటరీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేసింది.
ఆర్మోరీ భద్రతా విభాగంలో ఉన్న ఏడుగురు గార్డుల కళ్ళుగప్పి, సీసీటీవీ కెమెరాలు పనిచేయని సమయంలో ఈ చోరీ జరిగింది. ఆర్మీకి చెందిన లోపలి వ్యక్తుల (ఇన్సైడర్లు) ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్సైన ఆయుధాలను రికవరీ చేసినట్లు సమాచారం అందుతుండగా, సైనిక భద్రతా వ్యవస్థల్లో చోటుచేసుకున్న ఈ తీవ్ర లోపంపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.

