వైశాలి: బీహార్లోని వైశాలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన (బ్రిడ్జి) ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకోగా, స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించి, ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

