Breaking News

పార్టీ మారే ప్రసక్తే లేదు.. ప్రచారాలన్నీ అబద్ధం: ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటన!

హైదరాబాద్: తాను బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలని, అవన్నీ పుకార్లేనని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బోయిన్‌పల్లిలో జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి, తాను పార్టీ మారుతానన్న ప్రచారంతో ఆందోళన చెంది ఓ బీఆర్ఎస్ కార్యకర్త తనకు రక్తంతో ఉత్తరం రాశారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

మల్లారెడ్డి ఏమన్నారంటే..?

“నాకు ఆ ఉత్తరం రాసిన కార్యకర్త పేరు గానీ, చిరునామా గానీ తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆ అభిమానిని నేరుగా వెళ్లి కలిసేవాడిని. నేను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను బీఆర్ఎస్‌లోనే ఉంటాను.”

గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ బర్త్‌డే వేడుకల వేదికగా వీటన్నింటికీ ఆయన స్వయంగా చెక్ పెట్టారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *