Technology
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…
భీంగల్‌లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు
భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…
ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం
హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ…
నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ…
విలాసాగర్‌లో కాంగ్రెస్‌లోకి జోరుగా చేరికలు
విలాసాగర్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). జమ్మికుంట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మండల పరిధిలోని విలాసాగర్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రణవ్ వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ…
బీఆర్ఎస్ పార్టీలోకి 29వ డివిజన్ నుంచి భారీగా చేరికలు
మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరిన షేక్ మజీద్ షేక్ మజీద్‌తో పాటు సుమారు 100 మంది పార్టీ కండువా కప్పుకున్న వైనం బీఆర్ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది: గణేష్ బిగాల పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి నిజామాబాద్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ నగరంలోని 29వ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో…
ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమీక్ష
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ భీంగల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల పరిధిలో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు), ఇంకుడు గుంతల నిర్మాణాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం CCలు, VAOలు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి VAO పరిధిలో కనీసం రెండు ఫామ్ పాండ్స్‌ను…
మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం
మద్నూర్, ఆగస్టు 25:(E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్…
హైదరాబాద్ టెక్ స్టార్టప్ ‘వాటర్’ $2.5 మిలియన్ల నిధుల సమీకరణ
హైదరాబాద్‌కు చెందిన ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Physical AI) స్టార్టప్ ‘వాటర్’ (WATER) $2.5 మిలియన్ల (సుమారు ₹23.7 కోట్లు) సీడ్ నిధులను సమీకరించింది. ఈ ఫండింగ్ రౌండ్‌కు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎండియా పార్ట్‌నర్స్ (Endiya Partners) నాయకత్వం వహించగా, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తదితర ఏంజెల్ ఇన్వెస్టర్లు భాగస్వామ్యం వహించారు. ముఖ్యమైన వివరాలు: మానవ…
నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…

