పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
44వ డివిజన్ కార్పొరేటర్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఆయన సతీమణితో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గంగాపూర్ నాగేశ్వరరావు, పూజారి భాస్కర్ దాస్, వెంకటేశ్వర్లు, ఆదం, అరివెళ్ల ఏడుకొండలు, పెయింటర్ వెంకటేశ్వరరావు, బంక రాము, కేసుపాక లక్ష్మి, కోయిల పద్మ, దుర్గా, రాంబాయి, గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


