నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…

