Ranga Reddy
చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.
అక్బర్‌నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…
పాపన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ముధోల్, ఆగస్టు 18:(E6tv NEWS: A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ గౌడ సంఘాల నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం…
పాపన్న గౌడ్ సాక్షిగా దళిత బహుజనుల హక్కుల కోసం ఐక్య ఉద్యమం
నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్)కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ…
తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏర్పాటు
నూతన కార్యవర్గం ఎన్నిక.. అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ హైదరాబాద్ ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రాఘవాచారి, ఉపాధ్యక్షులు కొండూజు విజయ్ కుమార్ చారి, కార్యనిర్వాహక కార్యదర్శి అనంత రాములు తదితరులు…
మాజీ సర్పంచ్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే
పిట్లం, ఆగస్టు 16: (E6 tv NEWS: ప్రతినిధి) పిట్లం మండలం రాంపూర్ (కలాన్) మాజీ సర్పంచ్ మందాడి నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరై నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…
బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ
వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు. ఈ…

