Ranga Reddy
ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
భీమ్‌గల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో భీమ్‌గల్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 278 మంది…
నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ డిమాండ్
బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు…
కోరపల్లి భూ వివాదంలో నకిలీ ఆర్‌ఓఆర్ పత్రాలపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
కరీంనగర్, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కోరపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నకిలీ ఆర్.ఓ.ఆర్., 13(బి), 13(సి) సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వరపల్లికి చెందిన బోయిని లావణ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.కోరపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 553/ఎలో 4 ఎకరాల 32 గుంటల భూమిని తాను కొనుగోలు చేశానని లావణ్య తెలిపారు. తన పేరుపై మ్యూటేషన్…
22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్
ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…
పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…
భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…
గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ
బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…
మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు…

