Breaking News

తన పేషీకి ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్!

సీఎం ఆర్‌ఎఫ్‌ (CM Relief Fund) లంచం కేసులో ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో తన పేషీకి ఎలాంటి సంబంధమూ లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ దొరికిన ఆ నిందితులు తమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేయడం లేదని ఆయన తెలిపారు.

ఒక పత్రికలో వచ్చిన వార్తపై మంత్రి ఓఎస్‌డీ (OSD) పులి సైదులు వివరణ ఇస్తూ స్పందించారు. అరెస్ట్ అయిన వ్యక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పేషీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీనిపై సదరు వార్తా సంస్థ హెడ్‌లైన్‌లో దొర్లిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ, అరెస్ట్ అయిన వారిలో ఒకరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కాగా, మరొకరు పారిశ్రామిక అభివృద్ధి సంస్థలో (Industrial Development Corporation) పనిచేస్తున్నారని వివరణ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *